Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలికిరిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు

    కలికిరిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు

    కలికిరి, 2026 జూలై 18:

    కలికిరి గ్రామ దేవత శ్రీ యల్లమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర నేడు (జూలై 18) సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

    ఈ రథయాత్రను స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రథయాత్ర విజయవంతం కావడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

    ఇవి కూడా చదవండి

    గ్రామ వీధుల గుండా అమ్మవారి రథోత్సవం సాగనున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించనున్నారు. మంగళ వాయిద్యాలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య రథయాత్ర భక్తులను అలరించనుంది.

    ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు కలికిరిలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

    అత్యధికంగా చదివినవి