Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నెల్లూరు జిల్లా కోట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు మరియు తిరుపతి జిల్లా వెంకటగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి...

    Author RAJANEETHI | 16 Jul 2026, 09:47 PM | ANDHRA PRADESH
    నెల్లూరు జిల్లా కోట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు మరియు తిరుపతి జిల్లా వెంకటగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి...

    నెల్లూరు జిల్లా(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): కోట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు వివిధ ఆధార్ సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు.నెల్లూరు జిల్లా కోట మండలంతో పాటు పరిసర గ్రామాలు, పంచాయతీల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కేంద్రంలో ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు చేయించుకోవడంతో పాటు చిన్నారులకు కొత్త ఆధార్ నమోదు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సిమ్‌ల విక్రయం, పాత సిమ్‌ల రీప్లేస్‌మెంట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.ప్రజలు కోట హెడ్‌క్వార్టర్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆధార్ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. సేవలకు సంబంధించిన వివరాలు లేదా ఫిర్యాదుల కోసం 9492443364 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

    తిరుపతి జిల్లా వెంకటగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు....

    తిరుపతి జిల్లా: వెంకటగిరి వెంకటగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు. వెంకటగిరి పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, మారుమూల ప్రాంతాల ప్రజలు ఈ కేంద్రంలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రంలో ఆధార్ కార్డులో పేరు, జన్మతేదీ, చిరునామా తదితర వివరాల సవరణలు, చిన్నారులకు కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, ఇతర ఆధార్ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సిమ్ రీప్లేస్‌మెంట్, కొత్త సిమ్‌లు, రీచార్జ్‌లు తదితర టెలికాం సేవలను కూడా ఒకే చోట అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆధార్ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు సంబంధించిన వివరాలు, ఫిర్యాదుల కోసం 94924 43364 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

    ఇవి కూడా చదవండి