Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమాజ భాగస్వామ్యం తోనే డెంగీ జ్వరాల నియంత్రణ.డాక్టర్ జులేఖ

    సమాజ భాగస్వామ్యం తోనే డెంగీ జ్వరాల నియంత్రణ.డాక్టర్ జులేఖ

    వాయల్పాడు 7/7/26. సమాజ భాగస్వామ్యం తోనే డెంగీ జ్వరాలను నియంత్రణ చేయవచ్చు అని మండలం లోని చింతపర్తి పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేఖ బేగం మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.డెంగ్యూ వ్యతిరేక మాసోత్చవాలలో భాగంగా ఆశా దినోత్సవం సందర్బంగా దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు వాటి పర్యవసానాలు మరియు శుక్రవారమును పొడి దినముగా పాటించడం వల్ల కలుగు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించడం పైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు ఈ ఐదు(డెంగీ, మలేరియా, ఫైలేరియా, చీకున్ గణ్య, మెదడు వాపు) రకాల జ్వరాలు ప్రజారోగ్యానికి ప్రమాదం. ఇటీవలే ప్రభుత్వం మలేరియా వ్యాధిని నోటిపైయబల్ డిసీజ్ గా గుర్తింతించినది.తీవ్ర జ్వరం,చలి,తలనొప్పి,నీరసం,వాంతులు,వికారం,కనుగుడ్లు పక్కకు తిప్పలేకపోవడం,శరీరం పై దద్దులు,రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు ఈ జ్వరాలలో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు ను బట్టి రక్తపరీక్షలు చేయించుకుని,సకాలంలో చికిత్స పొందితే ప్రాణాపాయం ఉండదు.నివారణా చర్యలు---1.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం 2.చెత్త దిబ్బలు ఊరికి దూరంగా వేసుకోవాలి. 3.పందులను గ్రామానికి 5కి.మీ దూరంగా ఉంచాలి. 4.ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి 5.నీటి నిల్వలు పై మూతలు ఉంచాలి.6.ధోమతెరలు వాడాలి 7.కిటికీలకు మెష్ కొట్టించాలి.8.ప్రతీ రోజు సాయంత్రం ఇంటిలో పచ్చి వేపాకు పొగ వేసుకోవాలి. 9.ప్రతీ రోజు ఇంటిలో సాయంత్రం లైట్స్ వేసినప్పుడు తలుపులు,కిటికీలు మూసివేయాలి.10.కాలువలలో చెత్తవీయరాదు.గర్భవతులు, బాలింతలు, పది సంవత్సరాలు లోపు పిల్లలు,అరవై సంవత్సరాలు పైబడిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కనుక ఈ వర్గానికి చెందిన వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దోమల నిర్మూలన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ధోమలపై దండయాత్ర విజయవంతం అవుతుంది అన్నారు. ఈ సంవత్సరము తీమ్ మూడు పద్ధతులు పాటిద్దాం (చెక్, క్లీన్, క్లోజ్ ).అనంతరం ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తూ కరపత్రాలు ఆవిష్కరణ చేసి పంపిణీ చేశారు.ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ జులేక బేగం, డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, పార్టవేక్షకులు బహుద్దీన్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి