Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "థాంక్యూ సిఎం సార్" పాత పెన్షన్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయడు గారికి ధన్యవాదములు

     "థాంక్యూ సిఎం సార్" పాత పెన్షన్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయడు గారికి ధన్యవాదములు

    పత్రికా ప్రకటన: పీలేరు :అన్నమయ్య జిల్లా: 24 జూన్ 2026: "థాంక్యూ సిఎం సార్" పాత పెన్షన్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయడు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ పీలేరు నందు కార్యక్రమం జరిగింది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా సహాధ్యక్షులు పచ్చార్ల సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ క్యాబినెట్లో ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి గారికి 11వేల ఉద్యోగులు కుటుంబాలలో ఆనందం నింపినట్లు తెలిపారు.ఇది చారిత్రక నిర్ణయమని అన్నారు.అదేవిధంగా మిగిలిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల జీవితాలలో వెలుగుల నింపాలని కోరారు. సీఎం జిందాబాద్ అంటూ నినాదాలతో ఉపాధ్యాయులు హోరెత్తించారు.గతంలో కూడ సిపియస్ ఉద్యోగుల కు ఫ్యామిలీ పెన్షన్,గ్రాట్యుటి ఇచ్చిన ఘనత చంద్ర బాబు నాయుడు గారిదే అని అన్నారు. ఓ పి ఎస్ అమలు చేసినందుకు గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు మండల అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జయపాల్ రెడ్డి,కేవీ పల్లి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి బుసగాని వేణుగోపాల్, నరేష్ కుమార్,రామాంజులు రెడ్డి,గురవయ్య, వెంకటేశ్వర్లు, హరి రాష్ట్ర కార్యదర్శి దివాకర్, ఆర్థిక కార్యదర్శి శివశంకర్ ఇతరులు పాల్గొన్నారు.