"థాంక్యూ సిఎం సార్" పాత పెన్షన్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయడు గారికి ధన్యవాదములు
పత్రికా ప్రకటన: పీలేరు :అన్నమయ్య జిల్లా: 24 జూన్ 2026: "థాంక్యూ సిఎం సార్" పాత పెన్షన్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయడు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ పీలేరు నందు కార్యక్రమం జరిగింది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా సహాధ్యక్షులు పచ్చార్ల సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ...