Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇరువారంలో రూ.1.60 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం...

    ఇరువారంలో రూ.1.60 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం...

    చిత్తూరు,( రాజనీతి): చిత్తూరు నగర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా ఇరువారం వద్ద రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ బుధవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ అమర్‌బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నగరంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే స్థానికంగా విద్యుత్‌ సరఫరా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు అంతరాయాలు తగ్గేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, విద్యుత్‌ శాఖ అర్బన్‌ ఈఈ మునిచంద్ర, నిర్మాణ విభాగం ఈఈ భాస్కర్‌ నాయుడు, అధికారులు, సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి