Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 13వ వార్డులో రూపేష్ రెడ్డి పేరు!...అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో వైకాపా

    13వ వార్డులో రూపేష్ రెడ్డి పేరు!...అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో వైకాపా

    చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నగరంలోని 13వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా బి.కె. రూపేష్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వార్డు పునర్విభజనతో గతంలో 10వ వార్డుగా ఉన్న శాంతినగర్‌ కాలనీ, ఎన్‌.బి. కాలనీ, వివేకానంద కాలనీ ప్రాంతాలు ప్రస్తుతం 13వ వార్డులోకి వచ్చాయి.ఈ ప్రాంతానికి చెందిన రూపేష్‌ రెడ్డి మొదటి నుంచీ వైకాపాలో కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వార్డు ప్రజలతో నిత్యం మమేకమవుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వైకాపా యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

    గతంలో ఈ ప్రాంతానికి కార్పొరేటర్‌గా పనిచేసిన రఘురాం భార్య సునీత గత ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 13వ వార్డులో పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. రూపేష్‌ రెడ్డిని బరిలోకి దింపే అంశంపై చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.సి. విజయానంద రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.