13వ వార్డులో రూపేష్ రెడ్డి పేరు!...అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో వైకాపా

చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నగరంలోని 13వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా బి.కె. రూపేష్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వార్డు పునర్విభజనతో గతంలో 10వ వార్డుగా ఉన్న శాంతినగర్‌ కాలనీ, ఎన్‌.బి. కాలనీ, వివేకానంద కాలనీ ప్రాంతాలు ప్రస్తుతం 13వ వార్డులోకి వచ్చాయి.ఈ ప్రాంతానికి చెందిన రూపేష్‌ రెడ్డి మొదటి నుంచీ వైకాపాలో కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వార్డు ప్రజలతో నిత్యం మమేకమవుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వైకాపా యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఈ ప్రాంతానికి కార్పొరేటర్‌గా పనిచేసిన రఘురాం భార్య సునీత గత ఎన్నికల ముందు...