Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీసీల హక్కుల కోసం సుప్రీం గడప తొక్కుతాం” – ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, కె.మురళీమోహన్

    బీసీల హక్కుల కోసం సుప్రీం గడప తొక్కుతాం” – ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, కె.మురళీమోహన్

    చిత్తూరు (రాజనీతి): బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రజాదర్బార్‌లో కూటమి నేతలతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. న్యాయపరంగా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగకూడదనే ఉద్దేశంతో వైకాపా నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని వారు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో 16,800 మంది రాజకీయ పదవులు కోల్పోయారని పేర్కొన్నారు.బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం టీడీపీ విధానంలో భాగమని, 1987లో 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యేలు తెలిపారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించే విషయంలో ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో కూటమి నేతలు బీఎన్‌ రాజసింహులు, త్యాగరాజన్, సీకే లావణ్య, చైతన్య, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేశ్‌ యాదవ్, యశ్వంత్, చిట్టిబాబు, దీపశ్రీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.