బీసీల హక్కుల కోసం సుప్రీం గడప తొక్కుతాం” – ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కె.మురళీమోహన్
చిత్తూరు (రాజనీతి): బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రజాదర్బార్లో కూటమి నేతలతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. న్యాయపరంగా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగకూడదనే ఉద్దేశంతో వైకాపా నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని వారు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లు అమలు...