Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజల కష్టమే తన కష్టం...చిత్తూరు జనసేన కార్యదర్శి దేవినేని యశ్వంత్

    ప్రజల కష్టమే తన కష్టం...చిత్తూరు జనసేన కార్యదర్శి  దేవినేని యశ్వంత్

    చిత్తూరు(రాజనీతి): ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ.. యువతకు అందుబాటులో ఉంటూ జనసేన పార్టీ చిత్తూరు యువ నాయకుడు దేవినేని యశ్వంత్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తున్న ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, పేదల సమస్యలను ఓపికగా వింటూ అవసరమైన సందర్భాల్లో తన వంతు సహాయం అందిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, గృహాలు, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో పలు కార్యక్రమాలను ప్రకటించింది.ఇదిలా ఉండగా చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో దేవినేని యశ్వంత్ పేరు చర్చకు వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలువురు నాయకుల పేర్లతో పాటు యశ్వంత్ పేరు కూడా మేయర్ పదవికి సంబంధించి వినిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న యశ్వంత్ రాజకీయంగా మరింత చురుగ్గా మారడం ఆసక్తికరంగా మారింది.