ప్రజల కష్టమే తన కష్టం...చిత్తూరు జనసేన కార్యదర్శి దేవినేని యశ్వంత్

చిత్తూరు(రాజనీతి): ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ.. యువతకు అందుబాటులో ఉంటూ జనసేన పార్టీ చిత్తూరు యువ నాయకుడు దేవినేని యశ్వంత్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తున్న ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, పేదల సమస్యలను ఓపికగా వింటూ అవసరమైన సందర్భాల్లో తన వంతు సహాయం అందిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో...