Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గురజాల జగన్మోహన్ అభివృద్ధికి భవ్య బాసట..46వార్డులో జోరైన ప్రచారం!

    గురజాల జగన్మోహన్ అభివృద్ధికి భవ్య బాసట..46వార్డులో జోరైన ప్రచారం!

    చిత్తూరు(రాజనీతి) డైలీ దినపత్రిక: చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారంటూ వల్లేరు భవ్య చౌదరి అభినందనలు తెలిపారు. చిత్తూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం, ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. నగర మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఇటీవల ఎమ్మెల్యే వెల్లడించారు.ఇదిలా ఉండగా 46వ వార్డులో వల్లేరు భవ్య చౌదరి ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. వార్డులో ఏ సమస్య ఎదురైనా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా వార్డులో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన బోరు ఏర్పాటు చేయించి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని భవ్య చౌదరి తెలిపారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు కొంతమేర తొలగినట్లు ఆమె పేర్కొన్నారు.అలాగే తమ ప్రాంతంలో రహదారి సమస్యలను కూడా భవ్య చౌదరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్డు పనులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పదవి కోసం కాకుండా పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని భవ్య చౌదరి పేర్కొంటున్నారు."ప్రజల సమస్య వినగానే స్పందిస్తున్నారు.. ఇంటింటికీ వచ్చి మాట్లాడుతున్నారు. వార్డులో అభివృద్ధి పనుల కోసం ప్రయత్నిస్తున్నారు. నీళ్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బోరు వేయించడంతో ప్రజలకు ప్రయోజనం కలిగింది. ఇలాగే ప్రజల మధ్య ఉంటే రాబోయే రోజుల్లో మరింత బాధ్యత తీసుకోవాలని కోరుకుంటాం” అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో 46వ వార్డులో వల్లేరు భవ్య చౌదరి పేరు వినిపిస్తోందని, ఆమెను కార్పొరేటర్‌గా చూడాలని కొందరు స్థానికులు మాట్లాడుకుంటున్నారని సమాచారం. అయితే ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయం, అభ్యర్థిత్వం తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

    గురజాల జగన్మోహన్ అభివృద్ధికి భవ్య బాసట..46వార్డులో జోరైన ప్రచారం! - Additional Image