గురజాల జగన్మోహన్ అభివృద్ధికి భవ్య బాసట..46వార్డులో జోరైన ప్రచారం!
చిత్తూరు(రాజనీతి) డైలీ దినపత్రిక: చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారంటూ వల్లేరు భవ్య చౌదరి అభినందనలు తెలిపారు. చిత్తూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం, ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. నగర మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఇటీవల ఎమ్మెల్యే వెల్లడించారు.ఇదిలా ఉండగా 46వ వార్డులో వల్లేరు భవ్య చౌదరి ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. వార్డులో ఏ సమస్య ఎదురైనా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా వార్డులో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన బోరు ఏర్పాటు చేయించి నీటి...