Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పార్టీ కోసం పరుగు.. మేయర్ పీఠంపై ఎల్‌బీఐ లోకేష్ పేరు!

    పార్టీ కోసం పరుగు.. మేయర్ పీఠంపై ఎల్‌బీఐ లోకేష్ పేరు!

    చిత్తూరు(రాజనీతి):చిత్తూరు నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మేయర్ పీఠంపై ఆశావహుల లెక్కలు మొదలయ్యాయి. మేయర్ పదవి ఏ వర్గానికి రిజర్వు అవుతుందన్న అంశంతో పాటు.. ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో ఎల్‌బీఐ లోకేష్ పేరు కూడా చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారనే చర్చ ఉంది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ తో కలిసి పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రజా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయాలు కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో లోకేష్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మేయర్ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. రిజర్వేషన్ ఖరారైన తర్వాతే అభ్యర్థుల విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునే విధానానికి సంబంధించిన నిబంధనలు జారీ చేసింది.ఎల్‌బీఐ లోకేష్‌కు అవకాశం దక్కుతుందా?...అన్నది ప్రస్తుతం చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చగానే చూడాల్సి ఉంది.