పార్టీ కోసం పరుగు.. మేయర్ పీఠంపై ఎల్‌బీఐ లోకేష్ పేరు!

చిత్తూరు(రాజనీతి):చిత్తూరు నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మేయర్ పీఠంపై ఆశావహుల లెక్కలు మొదలయ్యాయి. మేయర్ పదవి ఏ వర్గానికి రిజర్వు అవుతుందన్న అంశంతో పాటు.. ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో ఎల్‌బీఐ లోకేష్ పేరు కూడా చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారనే చర్చ ఉంది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ తో కలిసి పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రజా...