Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు.. వేల ఎకరాల్లో పంట నష్టం

    ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు.. వేల ఎకరాల్లో పంట నష్టం

    రాజనీతి | ఉత్తరాంధ్ర:
    ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సిక్కోలు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదులు, వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు నష్టం వాటిల్లింది.

    నాగావళి, వంశధార ఉగ్రరూపం

    భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటగా.. వంశధార గోట్టా బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక స్థాయికి చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

    రహదారులు ధ్వంసం.. గ్రామాలకు రాకపోకలు బంద్‌

    పలు ప్రాంతాల్లో చెరువులు, కాలువలకు గండ్లు పడటంతో రహదారులు కొట్టుకుపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో తామర చెరువు కట్టకు గండి పడటంతో గలవల్లి–చిన్న గలవల్లి మధ్య రహదారి దెబ్బతిని నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ వంతెనలు, రహదారులు దెబ్బతినడంతో పలు గ్రామాలు రాకపోకలకు దూరమయ్యాయి.

    పంటలకు భారీ దెబ్బ పొంగిపొర్లుతున్న నదులు, వాగులు.. తెగిపోయిన రహదారులు.. నీట మునిగిన పంట పొలాలు

    ఇవి కూడా చదవండి

    వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 3 వేల హెక్టార్ల మొక్కజొన్న పంట వర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

    అప్రమత్తమైన యంత్రాంగం

    వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించే చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు SDRF, NDRF బృందాలను ప్రమాదకర ప్రాంతాల్లో మోహరించారు.

    మరికొన్ని ప్రాంతాల్లోనూ వరద ముప్పు

    ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ వరద పరిస్థితులపై అధికారులు నిఘా పెట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

    వర్షం తగ్గినా.. రైతుల కంట నీరు! ఉత్తరాంధ్రలో వరదల దెబ్బకు పంటలు, రహదారులకు భారీ నష్టం

    అత్యధికంగా చదివినవి