ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు.. వేల ఎకరాల్లో పంట నష్టం
రాజనీతి | ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సిక్కోలు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదులు, వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు నష్టం వాటిల్లింది. నాగావళి, వంశధార ఉగ్రరూపం భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటగా.. వంశధార గోట్టా బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక స్థాయికి చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రహదారులు ధ్వంసం.....