Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీడీపీకి కష్టకాలంలో అండగా.. ప్రజలకు నిత్యం అందుబాటులో! చిత్తూరులో కజూర్ బాలాజీ పేరు హాట్ టాపిక్

    టీడీపీకి కష్టకాలంలో అండగా.. ప్రజలకు నిత్యం అందుబాటులో! చిత్తూరులో కజూర్ బాలాజీ పేరు హాట్ టాపిక్

    చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచి, పలు కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేశారని పేర్కొంటున్నారు.రాజకీయాలతో పాటు ప్రజా సేవకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న బాలాజీ.. ‘‘ప్రజలే నాకు దేవుళ్లు’’ అనే భావనతో పనిచేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యుడు గురజాల జగన్‌ మోహన్ ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాల్లో సొంత నిధులతో ప్రజలకు సహాయం అందిస్తున్నారని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని అంటున్నారు.

    మేయర్ రేసులో పేరు..!

    ప్రస్తుతం చిత్తూరు నగర రాజకీయ వర్గాల్లో కజూర్ బాలాజీ పేరు మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి వినిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు, సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఇవి కూడా చదవండి

    తండ్రి బాటలో తనయుడు...

    కజూర్ బాలాజీతో పాటు ఆయన తనయుడు జస్వంత్ కూడా ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు చేరువవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. దీంతో బాలాజీ కుటుంబం చిత్తూరు నగర రాజకీయాల్లో మరో తరం నాయకత్వానికి సిద్ధమవుతోందన్న చర్చ మొదలైంది.పార్టీ కోసం కష్టపడిన అనుభవం, ప్రజా సేవను కొనసాగిస్తున్న తీరు, స్థానికంగా పెరుగుతున్న పరిచయాలతో కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం చిత్తూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.