టీడీపీకి కష్టకాలంలో అండగా.. ప్రజలకు నిత్యం అందుబాటులో! చిత్తూరులో కజూర్ బాలాజీ పేరు హాట్ టాపిక్
చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచి, పలు కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేశారని పేర్కొంటున్నారు.రాజకీయాలతో పాటు ప్రజా సేవకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న బాలాజీ.. ‘‘ప్రజలే నాకు దేవుళ్లు’’ అనే భావనతో పనిచేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యుడు గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాల్లో...