Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బెంగళూరులో డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్....12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్...

    బెంగళూరులో  డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల  జగన్ మోహన్....12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్...

    చిత్తూరు (సెప్టెంబర్ 05),(రాజనీతి) డైలీ దినపత్రిక:ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణ రాజును చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర 12వ డివిజన్‌ ఇన్‌చార్జి గోపినాథ్‌ శనివారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరుకు వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన డిప్యూటీ స్పీకర్‌ను ఎమ్మెల్యే జగన్మోహన్, గోపినాథ్‌ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ రాజకీయ, అభివృద్ధి అంశాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వివిధ డివిజన్లలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నేతలు చర్చించినట్లు తెలిసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరంపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
    చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయడంపై ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. 12వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తన వంతు పాత్ర పోషిస్తున్న గోపినాథ్‌.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జగన్మోహన్‌ నాయకత్వంలో కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజుతో ఎమ్మెల్యే జగన్మోహన్, గోపినాథ్‌ భేటీ కావడం చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రస్థాయి నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ మర్యాదపూర్వక భేటీ జరిగినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని డిప్యూటీ స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.