బెంగళూరులో డిప్యూటీ స్పీకర్ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్....12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్...
చిత్తూరు (సెప్టెంబర్ 05),(రాజనీతి) డైలీ దినపత్రిక:ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజును చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర 12వ డివిజన్ ఇన్చార్జి గోపినాథ్ శనివారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరుకు వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ను ఎమ్మెల్యే జగన్మోహన్, గోపినాథ్ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ రాజకీయ, అభివృద్ధి అంశాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వివిధ డివిజన్లలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నేతలు చర్చించినట్లు తెలిసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరంపై కూడా...