Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చంద్రబాబు–పవన్‌ అండ..! చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్‌ నాయకత్వం..! ప్రజల తోడు..! తగ్గేదేలే!

    చంద్రబాబు–పవన్‌ అండ..! చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్‌ నాయకత్వం..! ప్రజల తోడు..! తగ్గేదేలే!

    చిత్తూరు :చిత్తూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం సేవా కార్యక్రమాలు అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగిస్తున్న వ్యక్తి నేను తగ్గేదేలే....అంటూ స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న అపారమైన ఆదరణ, సహకారం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రజలే నా బలం.. ప్రజల సమస్యలే నా ఎజెండా అన్న నినాదంతో ముందుకు సాగుతున్న ఆయనకు స్థానిక ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి మరింత చేరువ అవుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి జరుగుతున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే సూచనలు ప్రభుత్వ సహకారం ప్రజల అండ కలిస్తే చిత్తూరు నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయని అన్నారు.పదవులు, హోదాలు కాదు.. ప్రజల నమ్మకమే ముఖ్యం. ప్రజలు నాతో ఉన్నంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. సేవా కార్యక్రమాలు ఆగవు.. ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. నేను తగ్గేదేలే....అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రజల కోసం ముందడుగు..సమస్యల పరిష్కారానికి మరో అడుగు..ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి వైపు పరుగులు..ప్రజల అండతో మరింత జోష్‌తో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం చిత్తూరులో ఆసక్తికరంగా మారుతోంది.ప్రజలే బలం.. సేవే లక్ష్యం.. అభివృద్ధే గమ్యం..
    నేను తగ్గేదేలే..