Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజల సమస్యలే ఎజెండాగా.. గోపీనాథ్‌ దూకుడు

    ప్రజల సమస్యలే ఎజెండాగా.. గోపీనాథ్‌ దూకుడు

    చిత్తూరు:ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపడమే లక్ష్యంగా చిత్తూరు టీడీపీ 12వ డివిజన్‌ ఇంచార్జి గోపీనాథ్‌ ముందుకు సాగుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ సూచనల మేరకు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.డివిజన్‌లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు గోపీనాథ్‌ దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.అత్యవసర సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని గోపీనాథ్‌ పేర్కొన్నారు. డివిజన్‌ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.పదవి అనేది బాధ్యతకు గుర్తు మాత్రమే. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల నుంచి వచ్చే ప్రతి విజ్ఞప్తికి ప్రాధాన్యత ఇస్తాను. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో సమన్వయం చేసుకుంటాను అని గోపీనాథ్‌ తెలిపారు.మౌలిక వసతుల మెరుగుదలతో పాటు అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు అందేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ డివిజన్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందిస్తున్న గోపీనాథ్‌ తీరుపై డివిజన్‌ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే చొరవతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని వారు కోరుతున్నారు.రానున్న రోజుల్లో టీడీపీ పార్టీలో మంచి పదవి వచ్చేలా ఆసిదాం...