ప్రజల సమస్యలే ఎజెండాగా.. గోపీనాథ్‌ దూకుడు

చిత్తూరు:ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపడమే లక్ష్యంగా చిత్తూరు టీడీపీ 12వ డివిజన్‌ ఇంచార్జి గోపీనాథ్‌ ముందుకు సాగుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ సూచనల మేరకు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.డివిజన్‌లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు గోపీనాథ్‌ దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.అత్యవసర సమస్యలపై వెంటనే...