Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎయిడ్స్ సురక్ష కోసం జనసమీకరణ చేద్దాం *95-95-99 లక్ష్యాల సాధనకు కృషి: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    ఎయిడ్స్ సురక్ష కోసం జనసమీకరణ చేద్దాం   *95-95-99 లక్ష్యాల సాధనకు కృషి: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    రాజనీతి | కలికిరి| ఆగస్టు 12, 2026 :
    ఎయిడ్స్ సురక్ష కొరకు జనసమీకరణ చేద్దాం. తద్వారా 95-95-99లక్ష్యాలను సాధిద్దాం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి పర్యవేక్షణ లో మండల కేంద్రం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ గులాబ్ జాన్ అధ్యక్షతన మొబైలిజషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం పై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.
    ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ యువతలో హెచ్‌ఐవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం, హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడం, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సకాలంలో పరీక్షలు మరియు చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
    95-95-99 లక్ష్యాల గురించి వివరించారు:
    మొదటి 95: హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్‌ఐవీ స్థితి గురించి తెలిసేలా పరీక్షలు నిర్వహించాలి.
    రెండవ 95: హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించిన వారిలో 95 శాతం మందికి యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ART) చికిత్స అందించాలి.
    మూడవ 99: చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందిలో వైరల్‌ లోడ్‌ను అణచివేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి అవకాశాలను తగ్గించాలి.
    యువత హెచ్‌ఐవీపై అపోహలకు దూరంగా ఉండి, సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని, అవసరమైన వారు సమీపంలోని ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా వారికి సామాజికంగా, వైద్యపరంగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
    95-95-99 లక్ష్యాల సాధన ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించి, ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ప్రిన్సిపాల్ ఉషశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ గులాబ్ జాన్, పర్యవేక్షకులు సుధాకర్, ఎమ్. ఎల్. హెచ్. పి. సైరా బాను, కళాశాల అధ్యాపకులు, ఆశా కార్యకర్త ధనలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి