Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రచురణార్థం: మార్పు కావాలి మార్పు రావాలి సిపిఐ పాదయాత్ర*

    ప్రచురణార్థం: మార్పు కావాలి మార్పు రావాలి సిపిఐ పాదయాత్ర*

    మదనపల్లి | ఆగస్టు 11, 2026

    భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం లో భాగంగా నేడు తంబళ్లపల్లె నియోజకవర్గ ములకలచెరువు మండల పెద్దపాళ్ళం గ్రామం లో ముందుగా నూతనంగా నిర్మించిన పతాకాన్ని పెద్దపాలెం సర్కిల్ వద్ద ఆవిష్కరించి అనంతరం పాదయాత్ర ను ప్రారంభించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ‌ మాట్లాడుతూ తంబాలపల్లి నియోజకవర్గం కరువు చాయలు అలుముకున్నాయని మొలకలచెరువు మండలంలో కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి అలాగే ములకలచెరువు మండలం పెద్ద పాలెంగ్రామం లో తుంగపల్లి ‌ రామానాయన కోట మలుగొల్లపల్లి ట్రయనిపల్లి చెన్నయ్య గారి పల్లి గొల్లపల్లి ఈ గ్రామాలలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు చేసి పంటలు పెట్టి అప్పులు తీర్చలేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని వ్యవసాయ కూలీలు చేయడానికి పనులు లేక మూట ముళ్ళు కట్టుకొని వలసలు పోతున్నారని వలసల నివారణకు రైతాంగాన్ని ఆదుకోవడానికి కరువు సహాయక చర్యలు చేపట్టాలని హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేసి సెలవులకు అనుసంధానం చేసి తద్వారా బోర్లు నీటిమట్టం పెరిగి పంటలు పండించుకుంటారని గ్రామాలలో మౌలిక సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని గ్రామాలలో త్రాగడానికి మంచినీళ్లు ప్రాణంగా పెంచుకున్న పశువులకు గొర్రెలు మేకలు మేతలేక పశువులను కళేబరాలకు తరలిస్తున్నారని పశుసంపదను ఆదుకోవడానికి గడ్డి కేంద్రాలను పశువులకు మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి అలాగే సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప మాట్లాడుతూ గ్రామాలలో వలసలు నివారించి ఉపాధి పనులు కల్పించాలని తంబాలపల్లి మల్లయ్య కొండ సాధువు కొండను ఖనిజ సంపద పేరుతో తవ్వకాలకు ఇచ్చిన టెండర్ను రద్దు చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని మండల పరిధిలో ఉన్న రెవెన్యూ భూ సమస్యలు రీ సర్వే పేరుతో సర్వేర్లు రెవెన్యూ యంత్రాంగం చేతివాతాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులను ప్రజలను పీడిస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని రీసర్వే పేరుతో భూ సమస్యలు రెవెన్యూ యంత్రాంగం సృష్టిస్తున్నారని ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు అనంతరం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ కొనసాగిన పాదయాత్రకు ప్రజలు నుండి విశేష స్పందన వచ్చింది.ఈ పాదయాత్ర కార్యక్రమం లో ప్రజానీకం అనేక సమస్యలను తమకు వివరించారని,ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని,అలాగే పక్కాఇండ్లు,పింఛన్లు తమకు మంజూరు కాలేదని చెప్పారని అన్నారు.సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని, సిపిఐ చేపట్టపోయే పోరాటాలలో యువకులు,మహిళలు కార్మికులు,కర్షకులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహయ నిజాం పెద్దపాలెం శాఖ కార్యదర్శి శంకరమ్మ చౌడప్ప లక్ష్మీదేవి గంగులప్పఉత్తన్న సమీరా ఎల్లప్ప సుబ్బన్న రెడ్డిప్ప తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి