Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అభివృద్ధి పనులు.. ప్రతి గడపకు చేరవేత...12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్..!

    Author | 03 Aug 2026, 09:22 PM | Politics, చిత్తూరు
    చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అభివృద్ధి పనులు.. ప్రతి గడపకు చేరవేత...12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్..!

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్ ): చిత్తూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్ విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని కలుసుకుని ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నారు.ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. రహదారుల నిర్మాణం, కాలువల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, విద్యుత్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ప్రతి ఇంటి వద్ద వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పారదర్శక పాలన అందిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని గోపీనాథ్ తెలిపారు. చిత్తూరు నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రచారం సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను గోపీనాథ్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్న ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందుతోంది. ప్రజల ఆశీస్సులు, సహకారంతో చిత్తూరు ను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కట్టుబడి ఉన్నారని గోపీనాథ్ తెలిపారు.గడప గడపకు నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.