చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అభివృద్ధి పనులు.. ప్రతి గడపకు చేరవేత...12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్..!
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్ ): చిత్తూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్ విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని కలుసుకుని ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నారు.ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. రహదారుల నిర్మాణం, కాలువల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, విద్యుత్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ప్రతి ఇంటి వద్ద వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం...