Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో అన్నమయ్య జిల్లా కలికిరి విద్యార్ధికి గోల్డ్ మెడల్

    ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో  అన్నమయ్య జిల్లా కలికిరి విద్యార్ధికి గోల్డ్ మెడల్

    కలికిరి 1/8/26
    అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన రెడ్డి సుమియ విద్యార్ధికి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన రెడ్డి సుమియాకు గోల్డ్ మెడల్ తో సత్కరించినది.శనివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన 14వ స్నాతకోచ్చవ కార్యక్రమం లో యూనివర్సిటీ ఛాన్స్లర్, వైస్ ఛాన్సెలర్ ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీ ప్రాసెసింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాతో పాటు బంగారు పథకం ప్రధానం చేశారు.ముఖ్య అతిధిగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష దేవరాయలు, అటర్ని జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకటరమణి , నాటికో ఫార్మా సి. ఈ. ఓ.చైర్మన్ రాజీవ్ నన్నపనేని, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, గ్రీన్ కో వ్యవస్థపకులు మరియు మేనేజంగ్ డైరెక్టర్ మహేష్ కుళ్లి, సి. ఈ. ఓ. మేఘన, ప్రొఫెసర్ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.రెడ్డి సుమియ తండ్రి మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుచు ప్రస్తుత యాంత్రిక జీవనంలో సురక్షితమైన, కల్తీలేని ఆహరం అందరికి అవసరం అనే దిశగా లక్ష్యం సాధించాలంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులు విద్యార్థులుకు మరింత చేరువ కావాలన్నారు ఆదిశగా జీవనసైలి లో మార్పులు అవసరం అన్నారు. తమ కూతురు స్వర్ణ పథకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ శుభ సందర్భం మా కుటుంబం గర్వించదగ్గ సమయం అన్నారు.గతం లో కలికిరి జే. ఎన్. టి యూ ఇంజనీరింగ్ కళాశాల లో రెడ్డి సుమియ బి. టెక్. ఫుడ్ టెక్నాలజీ కోర్స్ లో 2024 సంవత్సరములో డిస్టింక్షన్ లో పట్టా పొందినారు.కుటుంబ సభ్యులు, బంధువులు, కళాశాల ప్రొఫెసర్లు, అధ్యాపకులు,సహచర విద్యార్థులు సుమియ కు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు .

    ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో  అన్నమయ్య జిల్లా కలికిరి విద్యార్ధికి గోల్డ్ మెడల్  - Additional Image
    అత్యధికంగా చదివినవి