Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోదీ-చంద్రబాబు-పవన్ ఒకే వేదికపై... 7 వేల మంది పోలీసులతో హై అలర్ట్!

    మోదీ-చంద్రబాబు-పవన్ ఒకే వేదికపై... 7 వేల మంది పోలీసులతో  హై అలర్ట్!

    రాజనీతి | 31 జూలై 2026

    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించారు.

    విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన జోన్లు, 89 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌లో 80 నుంచి 100 మంది వరకు పోలీసు సిబ్బందిని నియమించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, విమానాశ్రయం పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

    ఇవి కూడా చదవండి

    ఆగస్టు 1న జరగనున్న ఈ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.

    అత్యధికంగా చదివినవి