మోదీ-చంద్రబాబు-పవన్ ఒకే వేదికపై... 7 వేల మంది పోలీసులతో హై అలర్ట్!
రాజనీతి | 31 జూలై 2026 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన జోన్లు, 89 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌లో 80 నుంచి 100 మంది వరకు పోలీసు సిబ్బందిని నియమించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, విమానాశ్రయం పరిసరాల్లో ప్రత్యేక నిఘా...