Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అభివృద్ధి మా బలం.. స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించండి..చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

    అభివృద్ధి మా బలం.. స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించండి..చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

    అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి...

    స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఇంటింటి ప్రచారంలో కూటమి నేతలు...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. "రెండేళ్ల ప్రభుత్వ పాలన – ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 31, 32 డివిజన్లలో కూటమి నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలతో పాటు వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించిన ఎమ్మెల్యే, గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.ప్రతి డివిజన్‌లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో చిత్తూరును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు సీకే లావణ్య, కాజూరు బాలాజీ, నరేష్, డివిజన్, బూత్ ఇన్‌చార్జులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి