Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరులో విజయవంతంగా 'కళ్యాణప్రాప్తిరస్తు' సినిమా ఆడిషన్ * ప్రతిభ గలవారికి అవకాశం కల్పించాలన్నదే ఉద్దేశం - హీరో రాయలసీమ భరత్

    పీలేరులో విజయవంతంగా 'కళ్యాణప్రాప్తిరస్తు' సినిమా ఆడిషన్ * ప్రతిభ గలవారికి అవకాశం కల్పించాలన్నదే ఉద్దేశం - హీరో రాయలసీమ భరత్

    పీలేరు 25-07-2026:
    తెలుగులో 'కళ్యాణప్రాప్తిరస్తు' చిత్రం నిర్మాణంలో భాగంగా నూతన నటీనటుల ఎంపిక (ఆడిషన్స్) కార్యక్రమాన్ని పీలేరులో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక తిరుపతి రోడ్డులోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఆడిషన్స్‌కు యువతీ యువకులు, బాల నటులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నటనా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ఔత్సాహిక నటీనటుల అభినయం, హావభావాలు, సంభాషణ నైపుణ్యాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. స్థానిక ప్రతిభకు సినీ రంగంలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు చిత్ర కథానాయకుడు రాయలసీమ భరత్, దర్శకులు అంజి తన్నీరు అన్నారు. ఈనెల 22న అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో, 24 న పీలేరులో కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అలాగే ఈనెల 26న మదనపల్లిలో కూడా ఆడిషన్స్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలియజేశారు.

    భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాయలసీమ భరత్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అంజి తన్నీరు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. అనాస్ రైటర్ అసోసియేట్ రైటర్‌గా, చైతన్య కందుల ఛాయాగ్రాహకుడిగా, శరవణ వాసుదేవన్ సంగీత దర్శకుడిగా, నాని కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. కృష్ణ కాశిమికోట కో-డైరెక్టర్‌గా, అశోక్ నాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చైతు రాయల్ ప్రొడక్షన్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టుతున్నారు. నృత్య దర్శకత్వం రామ్ ఇసుకపాటి, రేష్మా అందిస్తుండగా, ఎడిటింగ్‌ను ప్రవీణ్ ఎడిట్‌కట్ నిర్వహించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న 'కళ్యాణప్రాప్తిరస్తు' చిత్రం కోసం ఎంపికైన నటీనటుల వివరాలను సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పీలేరులో జరిగిన ఆడిషన్ కార్యక్రమానికి "నాన్న డైరీ" చిత్రం దర్శకుడు సురేష్, నిర్మాత కోటి సహకరించగా ఈ చిత్రంలో టైటిల్ రోల్లో నటించిన 'ఆల్ ది బెస్ట్' ఖాదర్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

    ఫోటో రైటప్:
    పీలేరులో జరిగిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' ఆడిషన్ కోసం వచ్చిన కళాకారులతో హీరో రాయలసీమ భరత్ (24 పీలేరు01)

    అత్యధికంగా చదివినవి