Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజలు సంతృప్తి చెందితేనే మా కృషి సార్థకం జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్!!!

    ప్రజలు సంతృప్తి చెందితేనే మా కృషి సార్థకం జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్!!!

    పీలేరు: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్ ఈరోజు పీలేరులోని సందీప్ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
    డాక్టర్ లోకవర్ధన్ హాస్పిటల్‌ను సందర్శించి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స పొందిన లబ్ధిదారులను వ్యక్తిగతంగా విచారించారు. పథకం ద్వారా పొందిన సహాయం, సమయానికి చికిత్స, వైద్యులు అందించిన సేవలు ఎలా ఉన్నాయని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
    లబ్ధిదారులు పథకం ద్వారా పొందిన సహాయంపై తమ సంతృప్తి వ్యక్తం చేయడంతో డాక్టర్ లోకవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.
    "ప్రజలు సంతృప్తి చెందితేనే మా కృషి సార్థకం" అని డాక్టర్ లోకవర్ధన్ అన్నారు.
    ఈ ఆకస్మిక తనిఖీలు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అత్యధికంగా చదివినవి