Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా ఆదర్శ పాఠశాల, కె.వి.పల్లిని సందర్శించిన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధ

    విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా ఆదర్శ పాఠశాల, కె.వి.పల్లిని సందర్శించిన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధ

    ఆదర్శ పాఠశాల కె.వి.పల్లిని సందర్శించిన అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధ గారు,పిఎంశ్రీ జిల్లా AAMO శ్రీ నాదిర్ష గారు
    అన్నమయ్య జిల్లా ఆదర్శ పాఠశాల, కె.వి.పల్లిని ఈరోజు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (APC) శ్రీమతి అనురాధ గారు సందర్శించారు.
    ఈ సందర్భంగా పీఎం శ్రీ (PM SHRI) పథకం కింద విడుదలైన నిధులు, వాటి వినియోగం మరియు చేపట్టిన అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, బోధన-అభ్యాస విధానాలపై ఆరా తీశారు.
    సందర్శనలో భాగంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌లు, వొకేషనల్ ఎక్విప్‌మెంట్, పాల్ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాల పనితీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
    తదనంతరం 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమగ్ర శిక్ష మరియు పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలు, విలువలు, క్రమశిక్షణను పెంపొందించుకొని సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం సమష్టిగా కృషి చేయాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ రెడ్డి భాషా గారు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మూడే శీను నాయక్ గారు, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ శ్రీ చెన్నూరు బాలాజీ గారు, పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) చైర్మన్ శ్రీ రెడ్డి భాషా గారు तथा పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.