Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ: ఇంటింటికీ వెళ్లి అందించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

     ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ: ఇంటింటికీ వెళ్లి అందించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

    *ఎన్టీఆర్ భరోసాతో పేదలకు కొండంత అండ: గుట్టపాలెం కస్పాలో పెన్షన్ల పండుగ.*

    పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం గుట్టపాలెం గ్రామం కస్పాలో బుధవారం ఉదయం 6 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటో తేదీ ఉదయాన్నే ప్రతి అర్హుడి చేతికి పెన్షన్ అందాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకే మీ ముందుకు వచ్చానని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    వైసీపీ హయాంలో పెన్షన్ల కోసం అవ్వాతాతలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. క్యూలైన్లలో నిలబడి, ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానాలు పడ్డారు. కానీ మన ప్రభుత్వం ఆ బాధలకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఇప్పుడు ఎలాంటి కోతలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకే పెన్షన్ వస్తోందని తెలిపారు.

    ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ₹4వేల నుండి ₹15వేల వరకు అందిస్తున్నాం. ఇది కేవలం డబ్బు కాదు, పేదల ఆత్మగౌరవం. మీ చిరునవ్వే మాకు బలం. ప్రతి పేదవాడి కంట్లో ఆనందం చూడడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

    అనంతరం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.