Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దివ్యాంగులకు ఉచిత ఆధునిక కృత్రిమ కాళ్ల అమరిక శిబిరం

    Author RAJANEETHI | 16 Jun 2026, 08:10 PM | ANDHRA PRADESH
    దివ్యాంగులకు ఉచిత ఆధునిక కృత్రిమ కాళ్ల అమరిక శిబిరం

    -ఆదర్శ సేవా సమితి పిలుపు
    వై.ఎస్.ఆర్ (కడప) మరియు అన్నమయ్య జిల్లాల్లోని దివ్యాంగుల కోసం జులై 2026 నెలలో ఉచిత ఆధునిక వెయిట్‌లెస్ కృత్రిమ కాలు (Artificial Limb) అమరిక 'అమెరికా శిబిరం' నిర్వహించనున్నట్లు ఆదర్శ ప్రత్యేక ప్రతిభావంతుల సేవా సమితి అధ్యక్షులు పి.వి.చలపతి, కార్యదర్శి కే. వి. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 51,000/- విలువైన ఈ అత్యాధునిక కృత్రిమ కాళ్లను అర్హులైన దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. జులై నెలలో లబ్ధిదారులకు సంబంధించిన కాలు కొలతలు తీసుకోవడం జరుగుతుంది.కొలతలు తీసుకున్న సుమారు 10 రోజుల వ్యవధిలోనే రూ. 51,000/- విలువైన ఆధునిక వెయిట్‌లెస్ కృత్రిమ కాలును ఉచితంగా అమరుస్తారు. ఈ శిబిరం కేవలం వై.ఎస్.ఆర్ (కడప) మరియు అన్నమయ్య జిల్లాల దివ్యాంగులకు మాత్రమే పరిమితం.శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అందుకోసం లబ్ధిదారుని ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నకలు (జెరాక్స్), కాలు ఎంతవరకు తొలగించబడిందో స్పష్టంగా కనిపించే ఫోటోను వాట్సాప్ ద్వారా పంపవలసి ఉంటుంది. వివరాల నమోదు మరియు ఇతర సమాచారం కోసం ప్రతినిధులు బి.ఎమ్. హుస్సేన్ / డి. రమేష్‌లను 8074623993, 9182778324, 9701733292 మొబైల్ నంబర్లలో లేదా ల్యాండ్ లైన్ నంబర్: 08562-295480 ద్వారా సంప్రదించవచ్చు.కార్యాలయ చిరునామా: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, D బ్లాక్, కొత్త కలెక్టర్ కార్యాలయం, వై.ఎస్.ఆర్ (కడప) జిల్లా. ఈ సమాచారం ఏ ఒక్క దివ్యాంగునికి ఉపయోగపడినా వారి జీవితంలో కొత్త వెలుగు నిండుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి మానవత్వాన్ని చాటుకోవాలని ఆదర్శ ప్రత్యేక ప్రతిభావంతుల సేవా సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.