Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశం

    Author RAJANEETHI | 15 Oct 2026, 06:04 PM | ANDHRA PRADESH
    మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశం

    మదనపల్లె అక్టోబర్ 15 (రాజనీతి): మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లెలోని దొంతి లేఅవుట్‌ వద్ద నూతన సహాయ ఎన్నికల అథారిటీ భవనంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ గదులను ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీలు చంద్రశేఖర్‌రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.