Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జలమయమైన రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణం....శాశ్వత పరిష్కారం ఏదీ?

    Author RAJANEETHI | 15 Oct 2026, 02:07 PM | ANDHRA PRADESH
    జలమయమైన రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణం....శాశ్వత పరిష్కారం ఏదీ?

    రేణిగుంట అక్టోబర్ 15 (రాజనీతి): నిత్యం వేలాది మంది యాత్రికులతో రద్దీగా ఉండే రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణం వర్షాలకు జలమయమవుతోంది. వర్షపు నీటికి మురుగునీరు తోడవడంతో దుర్వాసన వెదజల్లి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రేణిగుంట ముఖద్వారంలో మురుగునీరు స్వాగతం పలకడం పట్టణ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు.