Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరు జనసేనలో చంద్రమౌళికి పెద్ద పీట.. పార్లమెంట్ కమిటీలో కీలక స్థానం!

    చిత్తూరు జనసేనలో చంద్రమౌళికి పెద్ద పీట.. పార్లమెంట్ కమిటీలో కీలక స్థానం!

    చిత్తూరు (రాజనీతి): జనసేన పార్టీలో వి.చంద్రమౌళికి కీలక బాధ్యత లభించింది. చిత్తూరు పార్లమెంట్ జనసేన నిర్వాహక దళ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 32 మంది సభ్యులతో చిత్తూరు పార్లమెంట్ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కమిటీని నియమించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సభ్యుల బాధ్యతలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వి.చంద్రమౌళికి కమిటీలో స్థానం కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అప్పగించిన బాధ్యతలతో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జనసేన కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది.