Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెద్దాయనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన గడపలు... ఇప్పుడు కొడుకు జస్వంత్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఇది వారసత్వం కాదు... కొత్త రాజకీయ అడుగుకు సంకేతం!

    పెద్దాయనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన గడపలు... ఇప్పుడు కొడుకు జస్వంత్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఇది వారసత్వం కాదు... కొత్త రాజకీయ అడుగుకు సంకేతం!

    చిత్తూరు(రాజనీతి):చిత్తూరు రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్న కజూర్ బాలాజీ వారసుడిగా ఆయన తనయుడు జస్వంత్ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న కజూర్ బాలాజీకి, ఇప్పుడు తనయుడు జస్వంత్ అండగా నిలుస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఇరవై ఏళ్లుగా పెద్దాయనను నమ్ముకున్న గడపలు.. ఇప్పుడు ‘ఆయన కొడుకు వచ్చాడు’ అంటున్నాయి” అన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది.గడప. గడపల్లో కుటుంబానికి ఉన్న పరిచయాలు, పార్టీతో ఉన్న అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జస్వంత్ ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.టీడీపీ కోసం కజూర్ బాలాజీ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ, పార్టీకి కష్టకాలం వచ్చిన సందర్భాల్లోనూ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారని అనుచరులు గుర్తుచేస్తున్నారు. ఆ రాజకీయ అనుభవాన్ని జస్వంత్ తనదైన శైలిలో కొనసాగిస్తూ యువతతో మమేకమవుతున్నారని పేర్కొంటున్నారు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ పరిచయాలు ఒకవైపు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం మరోవైపు.. జస్వంత్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తి పెంచుతున్నాయి. “పెద్దాయన వేసిన పునాదిపై.. తనయుడు మరో అడుగు” అన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది.రాబోయే రోజుల్లో జస్వంత్ పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారా? కజూర్ బాలాజీ రాజకీయ వారసత్వాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.