Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 1,500 కిలోల లడ్డూ.. రూ.9 లక్షల ధర...లడ్డూ వేలంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్

    1,500 కిలోల లడ్డూ.. రూ.9 లక్షల ధర...లడ్డూ వేలంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్

    చిత్తూరు,(రాజనీతి): చిత్తూరు డీఐ రోడ్డులో నిర్వహిస్తున్న 50వ సంవత్సరం వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 1,500 కిలోల భారీ వినాయక లడ్డూను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ రూ.9 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఐ రోడ్డు వినాయక చవితి వేడుకల్లో భాగంగా భారీ లడ్డూను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లడ్డూ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ లడ్డూను కైవసం చేసుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు. 50వ సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.