Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మిట్టూరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవం

    మిట్టూరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవం

    చిత్తూరు ( రాజనీతి ) డైలీ దినపత్రిక: చిత్తూరు నగరంలోని మిట్టూరులో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనకు సమిష్టి సంకల్పాన్ని చాటేలా కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో తల్లులు, గర్భిణులు, యువత పాల్గొన్నారు.మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్‌ అభియాన్‌, ఇంద్రధనుష్‌, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో–బేటీ పడావో, పీఎం స్వనిధి తదితర పథకాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల కోసం వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించి స్వీట్లు, పండ్లు, బొమ్మలు పంపిణీ చేశారు. ముగ్గురు అంగన్వాడి తల్లులను సన్మానించారు. అంగన్వాడి ఇన్‌స్ట్రక్టర్‌ షఫీనా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ నాయుడు, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్యామ సుగుణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవితా రాజ్‌, నాయకులు అట్లూరి శ్రీనివాస్‌, షణ్ముగం, ఢిల్లీ రాణి, గోకుల్‌ యాదవ్‌, రెడ్డి మస్తాన్‌, హేమంత్‌ చౌదరి, అంగన్వాడి పర్యవేక్షకురాలు తులసి, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.