Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బిడ్డలకు జీవన నైపుణ్యాలను కన్నవారే కల్పించాలి డా:శ్రీగిరీష

    బిడ్డలకు జీవన నైపుణ్యాలను కన్నవారే కల్పించాలి  డా:శ్రీగిరీష

    ఆగస్టు 29,రాజనీతి:-

    ఆడబిడ్డ సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని, కన్నవారే కల్పించాలని, అందుకు మేలైన జీవన నైపుణ్యాల ను అలవర్చుకోనుటకు ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులతో స్నేహం చేయాలని,అప్పుడే ఆడబిడ్డ మరిన్ని సామాజిక మెలకువలు బిడ్డల స్వంత మవుతాయని, తలుపుల పి.హెచ్.సి ప్రదానవైద్యాధి కారులు డా:శ్రీగిరీష బాలికలకు పిలుపునిచ్చారు.

    మేళ్లచెరువు హైస్కూల్ బాలికలకు "బాలికల రక్షణ - అందరి బాధ్యత" అంశముపై అవగాహన మరియు ర్యాలీ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా డా: శ్రీ గిరిష మాట్లాడుతూ
    ఎంత దగ్గర వారైనా ఆడబిడ్డని తాకే క్రమంలో మంచి చెడు స్పర్శలు అంచనా వేసే నైపుణ్యాన్ని ఆడపిల్లలకి తెలిపారు

    ఎదుటి వ్యక్తి యొక్క అభిమతం అంచనా వేసి, జరిగే అకృత్యాలకు అడ్డుకట్టవేసే సామాజిక నైపుణ్యం బాలిక అలవర్చుకోవాలని,

    ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన జ్ఞాపకం బాల్యం అని, బాల్యానికి సమాజంలో అందరి మద్దతు అవసరమని డా:శ్రీగిరీష విద్యార్థులకు బరోసానిచ్చారు.

    కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యు కేషన్ కొండయ్య హెడ్మాస్టర్ సురేంద్ర పర్యవేక్షకులు నాగమ్మ ఏఎన్ఎం నాగవేణి సి హెచ్ ఓ కుమ్ముదా సచివాలయ సిబ్బంది మహిళా పోలీస్ రజియా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

    అత్యధికంగా చదివినవి