Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అసెంబ్లీలో వైకాపాకు చిత్తూరు ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ గట్టి కౌంటర్‌...

    అసెంబ్లీలో వైకాపాకు చిత్తూరు ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ గట్టి కౌంటర్‌...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరులోని కమర్షియల్‌ టాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని తిరుపతికి తరలిస్తూ గత వైకాపా ప్రభుత్వం 2024 మార్చిలోనే జీవో జారీ చేసిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ తెలిపారు. తాము అధికారంలో ఉండగా జారీ చేసిన జీవోను పక్కనపెట్టి, ప్రస్తుతం వైకాపా నాయకులు కార్యాలయ తరలింపుపై చిత్తూరులో ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనసభలో ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కమర్షియల్‌ టాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయ తరలింపునకు సంబంధించిన జీవోను ప్రజల ముందుంచామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్యాలయాన్ని తరలించినట్లు వైకాపా నాయకులు ప్రచారం చేయడం సరికాదన్నారు.

    మామిడి రైతులకు గిట్టుబాటు ధరపై సీఎంకు కృతజ్ఞతలు....

    చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకునే ఉద్దేశంతో తోతాపురి మామిడికి వరుసగా రెండో ఏడాది కిలోకు రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించడంపై ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు శాసనసభ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మామిడి రైతుల సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి, సంబంధిత అంశాన్ని పరిశీలించి గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరుసగా రెండో ఏడాది తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర ప్రకటించడం అభినందనీయమన్నారు.

    ఇవి కూడా చదవండి