Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *దోమల అంతం ప్రతి ఒక్కడి పంతం కావాలి* డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ నాయక్

    *దోమల అంతం ప్రతి ఒక్కడి పంతం కావాలి*  డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ నాయక్

    రాజనీతి | అమరావతి | ఆగస్టు 20, 2026
    దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నిర్మూలన ఏ ఒక్కడి బాధ్యత మాత్రమే కాదని, సామూహిక కృషి అవసరమని పి.హెచ్.సి తలుపుల ప్రధానవైద్యా ధికారులు డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ సంయుక్తంగా తెలిపారు.

    నేడు ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటపల్లి ఆదర్శ స్కూల్, మరియు కోటపల్లె సర్కిల్ వద్ద పి.హెచ్.సి వివిధ స్థాయి అధికారులు,సిబ్బంది చే అవగాహన ర్యాలీ ప్రతిజ్ఞ,మానవాహారం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు.

    దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల కలిగే ముప్పును వ్యక్తి,కుటుంభం, సమాజం,ముందస్తు నివారణ చర్యల ద్వారా ప్రమాదాన్ని తగ్గించే సులభతరమైన మార్గాలు అనేకమని, ఇంటి చుట్టుపక్కల నీరు నిలువలేకుండా చూడటం, దోమతెరలు, మస్కిటో రిపెలెంట్స్ వాడకం,ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, నీటి నిలువలపై మూతలు పెట్టడం మొదలగు నివారణ చర్యలు తీసుకోవాలని డా:గిరీష,డా:చంద్రశేఖర్ తెలిపారు.తర్వాత దోమ ప్రాణాంతకం అంటూ నినాదాలు చేస్తూ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఆపై దోమల అంతానికి కృషి చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
    కార్యక్రమంలో డాక్టర్ శ్రీ గిరీష్ డాక్టర్ చంద్రశేఖర్ డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య, శ్రీనివాసులు, పీహెచ్ఎన్ కుసుమ, నాగమ్మ ,రెడ్డప్ప, ఏఎన్ఎం లు, సిహెచ్ఓ లు,ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి