Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రతి బిడ్డ తొలి ప్రపంచం అమ్మ ఒడి డా:శ్రీగిరీష ప్రదానవైద్యాధికారులు

    ప్రతి బిడ్డ తొలి ప్రపంచం అమ్మ ఒడి  డా:శ్రీగిరీష  ప్రదానవైద్యాధికారులు

    ప్రెస్ నోట్🙏🙏
    తేదీ:12-08-26


    శిశువు పెరుగుతున్న ప్రక్రియలో భాగంగా, దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా తల్లి మెలకువలు కలిగి ఉండాలని డా:శ్రీగిరీష తల్లులకు హితవు పలికారు.
    గూడరేవుపల్లిలో ఈ రోజు నిర్వహించిన మాత-శిశు ఆరోగ్య సేవలు నిర్వహిం చారు.

    శిశువుల్ని ముక్యంగా వెచ్చటి వాతావరణం, కమ్మని అమ్మపాలు, పరిశుభ్రత,రోగులకు దూరంగా ఉంచడం చేయాలని,
    ప్రతి రోజు గోరు వెచ్చటి నీటితో స్నానం,ఉతికిన మెత్తటి దుస్తులు, శిశువు మలమూత్ర విసర్జన చేసినప్పుడల్లా తడి బట్టలు మార్చడం,పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం, మొదలు జాగ్రత్త పాటించాలని,
    బిడ్డకు సరిపడ పాలు తల్లి నుండి పొందడానికి తల్లి అదన బలానిచ్చే పోషకా హారాన్ని విధిగా తీసుకోవా లని,జ్వరం దగ్గు జలుబు ఉన్నచో బిడ్డకు తల్లి పాలు ఆపకుండా దగ్గర్లోని డాక్టర్లని నివారణ చర్యలకై సంప్రదించాలని,
    బిడ్డకు తల్లి ఎనిమిది నుండి పది సార్లు ,సుమారు రెండు గంటల వ్యవధిలో బిడ్డకు పాలు పడుతూ ,
    ఐదు నుండి పది సార్లు మూత్ర విసర్జన చేస్తూ , నెలకు 500 గ్రాములు పెరిగితే శిశువు ఆరోగ్య లక్షణాల్లో ఒకటని,శిశువుల పెంపకం అమ్మకు ఒక కళ అని, డా:శ్రీగిరీష తల్లులకు సూచనలిచ్చారు.

    ఇవి కూడా చదవండి

    కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య, శ్రీనివాసులు, ఏఎన్ఎం కృష్ణమ్మ, సిహెచ్ఓ లావణ్య ఆశా కార్యకర్తలు గర్భిణీలు పాలిచ్చు తల్లులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి