Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'మీతోనే ఉంటాం'.. రెవా సభ్యులకు ఎమ్మెల్యేల భరోసా....

    'మీతోనే ఉంటాం'.. రెవా సభ్యులకు ఎమ్మెల్యేల భరోసా....

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాయల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రెవా) అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఆదివారం చిత్తూరులోని సీఎం కళ్యాణ మండపంలో జరిగిన రెవా నాలుగో సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు పీఎంఆర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెవా ప్రతినిధులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. అలాగే రానున్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెవా సభ్యుడికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
    దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, రాజకీయ జీవిత ఆరంభంలో రెవా సభ్యులే తనకు ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తుచేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అసోసియేషన్ భవనానికి స్థలం మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని, కార్పొరేషన్ ఎన్నికల్లో రెవా సభ్యుడికి అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ... రెవాతో పాటు బలిజ సామాజిక వర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానన్నారు.ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులను రెవా ప్రతినిధులు దుస్సాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కటారి హేమలత, శ్రీనివాస్, రెవా ప్రధాన కార్యదర్శి మోహన్ కృష్ణ, కోశాధికారి వెంకటేష్, గౌరవాధ్యక్షుడు వెంకటేశులు, లీగల్ అడ్వైజర్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.