Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఐదు రోజుల విరామం తర్వాత మళ్లీ మోగిన యుద్ధ భేరి.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు పునఃప్రారంభం!

    ఐదు రోజుల విరామం తర్వాత మళ్లీ మోగిన యుద్ధ భేరి.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు పునఃప్రారంభం!

    జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై క్షిపణి దాడికి ప్రతీకారం.. ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై అమెరికా దాడులు
    అంతర్జాతీయం | 30 జూలై 2026

    పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐదు రోజుల విరామం అనంతరం అమెరికా మరోసారి ఇరాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

    అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండ్ కేంద్రాలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు నిర్వహించారు. ఈ చర్యను అమెరికా "బలమైన ప్రతిస్పందన"గా అభివర్ణించింది.

    ఇవి కూడా చదవండి

    దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ప్రయోజనాలపై లేదా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగితే గట్టి ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. అనంతరం అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో లక్ష్యాలపై దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

    తాజా పరిణామాలతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణ ప్రభావం చమురు మార్కెట్లు, అంతర్జాతీయ నౌకాయానం, మధ్యప్రాచ్య భద్రతపై పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితిని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

    అత్యధికంగా చదివినవి